ఓనమాలు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి‌ జర్నలిజం పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఓనమాలు రానివారు కూడా సోషల్ మీడియా ఆధారంగా జర్నలిస్టులుగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ తరహా వ్యక్తులు అసభ్యంగా మాట్లాడుతూ, రోడ్ల మీద తిరుగుతూ తమను జర్నలిస్టులని చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. అలాంటి వారిని సీరియస్ జర్నలిస్టులు పక్కన పెట్టాలని, కనీసం పక్కన కూడా కూర్చోబెట్టుకోవద్దని హితవు పలికారు.

హైదరాబాద్‌లో జరిగిన ‘నవ తెలంగాణ’ 10వ వార్షికోత్సవ సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులపై ప్రత్యేకంగా ప్రసంశలు గుప్పించారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంలో, అధికారాన్ని నిలదీయడంలో కమ్యూనిస్టుల పాత్ర అపూర్వమని అన్నారు. 2004లో కాంగ్రెస్ గెలుపులో వారిచేసిన సహకారం మరచిపోలేనిదన్నారు.

ఇప్పుడు రాజకీయ నాయకులకే కాక, జర్నలిస్టులకు కూడా ప్రజల విశ్వాసం తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు, అధికారపక్షాన్ని ప్రశ్నించేందుకు కమ్యూనిస్టులు ఇప్పటికీ అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply