Revanth Reddy: పెన్షన్ దారులకు షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..!

రాష్ట్రంలో బోగస్ పెన్షన్‌లను అరికట్టేందుకు రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అసలైన లబ్ధిదారులకే పెన్షన్ అందేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, పెన్షన్ పొందేవారికి ఫేస్ రికగ్నిషన్ విధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 నుంచి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. పింఛన్ పంపిణీలో పారదర్శకత, నిష్పక్షపాతత కోసం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.

గ్రామీణ అభివృద్ధి అధికారులు, బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, వేలిముద్ర పరికరాలు, ఇతర ఎక్విప్‌మెంట్లు సమకూర్చేలా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అవసరమైన పరికరాలు లేని చోట, అధికారులే తమ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని పని చేయాల్సి ఉంటుంది. పంపిణీ పూర్తైన తర్వాత ‘చేయూత’ లబ్ధిదారుల వివరాలను పోస్టాఫీసుల వద్ద బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల మృతుల పేర్లపై పెన్షన్ మంజూరయ్యే దారులు మూసివేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 42.67 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, హెచ్ఐవీ బాధితులు, ఒంటరి మహిళలు వంటి కేటగిరీలు ఉన్నారు. ప్రభుత్వం నెలకు రూ.1000 కోట్ల కంటే ఎక్కువను పెన్షన్‌ల కోసం ఖర్చు చేస్తోంది. అయితే వేలిముద్రలలో సమస్యలు, మరణించిన వారి పేర్లపై పెన్షన్ మంజూరు వంటి ఇబ్బందుల నేపథ్యంలో కొత్త ఫేస్ రికగ్నిషన్ విధానం అమలుచేస్తోంది. ఇది లబ్ధిదారుల పట్ల న్యాయం జరిగేలా చేస్తుందని అధికారుల అభిప్రాయం.

Leave a Reply