Rajinikanth: 50 ఏళ్ల లెజెండరీ సినిమా జర్నీ..! రజనీకాంత్ కు CM, PM ప్రత్యేక విషెస్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. రజనీకాంత్ గారు అనేక వినూత్న పాత్రలతో, సామాజిక స్పృహ కలిగిన సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం పొందారు.

చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో,
“సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాల పూర్తి అయినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన సినిమాలు సమాజంపై ప్రభావం చూపాయి. లక్షల మంది ఆయన నుండి స్పూర్తి పొందారు” అన్నారు.

సీఎం ట్వీట్‌కు స్పందిస్తూ రజనీకాంత్,
“గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. మీ ప్రేమ, మద్ధతులతో నేను ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాను. ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

మోదీ స్పెషల్ విషెస్
ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రజనీకాంత్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మోదీ ట్వీట్‌లో,
“రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతమైనది. ఆయన పోషించిన పాత్రలు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను” అని తెలిపారు.

‘కూలీ’ బాక్సాఫీస్ ర్యాంపేజ్
రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, ఆగస్ట్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా మారింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹220 కోట్ల గ్రాస్, ₹118 కోట్ల షేర్ సాధిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply