Rajinikanth Fans: మంత్రి రోజాకు సీరియస్ వార్నింగ్
Rajinikanth Fans: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వచ్చి చంద్రబాబును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ దుమారం మొదలైంది.అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌తో తనకున్న పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే.. చంద్రబాబు, బాలయ్యపై ప్రశంసలు కురిపించారు రజనీ ఇక, చంద్రబాబు విజన్.. హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.. దీంతో, ఆయన వైసీపీకి టార్గెట్‌గా మారిపోయారు. ముఖ్యంగా మంత్రి రోజా రజినీకాంత్ పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ ఏపీలో మాట్లాడిన వ్యాఖ్యలతో ఆయన జీరో అయిపోయారు అని మంత్రి రోజా పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో పుదుచ్చేరిలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతల సమావేశం అయ్యారు. ఏపీ మంత్రి రోజాకు రజనీకాంత్ అభిమానుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్ ను విమర్శించే స్ధాయి రోజాకు లేదని హితవుపలికారు. చేసినా విమర్శలు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడుతాం అంటూ హెచ్చరించారు. మరోసారి రజనీకాంత్‌పై మాట్లాడితే వదిలే ప్రసక్తేలేదన్నారు.
Watch This:
రజినీకాంత్ ను విమర్శించే స్థాయి రోజాకు లేదని వారు పేర్కొన్నారు. రోజా తాను చేసిన విమర్శలకు వెంటనే రజినీకాంత్ కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పుదుచ్చేరిలో సమావేశమైన రజినీకాంత్ అభిమానసంఘం నేతలు మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని, మరోమారు రజినీకాంత్ పై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. ఇటీవల పుదుచ్చేరిలో తిరు కంచి గంగై వరదరాజు నాదీశ్వర ఆలయంలో పుష్కరిణి వేడుకలలో పాల్గొన్న మంత్రి రోజా అప్పుడు కూడా రజినీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు.
రజినీకాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారని, రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలతో.. ఇక నోటికొచ్చినట్టు రజనీకాంత్ పై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కచ్చితంగా ఏపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. లేదంటే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.