Indian railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ట్రైన్‌లో ఫ్రీ OTT సర్వీస్

ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు శుభవార్తను ప్రకటించింది. ట్రైన్ ప్రయాణం బోరింగ్‌గా అనిపించే వారికి ఇది సూపర్ న్యూస్. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆనందంగా మార్చేందుకు రైల్వే సంస్థ “రైల్ వన్” అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ లొకేషన్ వంటి సాధారణ సేవలతో పాటు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలను ఉచితంగా వీక్షించే అవకాశం కూడా కల్పించారు. రైల్వే ఉచిత వైఫైను ఉపయోగించి ఈ OTT కంటెంట్‌ను ఎటువంటి డేటా ఖర్చు లేకుండా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఇది మంచి అవకాశం. ఇకపై ప్రయాణంలో డేటా అయిపోవడం, నెట్‌వర్క్ సమస్యలు వంటి ఇబ్బందులు ఉండవు. వివిధ భాషల్లో వినోద కంటెంట్ అందుబాటులో ఉండటంతో ప్రయాణం మరింత ఎంజాయ్ చేయవచ్చు.

“రైల్ వన్” యాప్ ప్రత్యేకతలు:

ఒకే యాప్‌లో టికెట్ బుకింగ్, అన్‌రిజర్వ్డ్ టికెట్లు, ఫుడ్ ఆర్డర్, రైలు లొకేషన్ ట్రాకింగ్

“రైల్ మదద్” ద్వారా రైల్వే సహాయం సులభంగా పొందే సదుపాయం

వేర్వేరు యాప్‌ల అవసరం లేకుండా అన్ని సేవలు ఒకే చోట

ప్రస్తుతం Google Play Store మరియు Apple App Store లో “రైల్ వన్” యాప్ ఉచితంగా అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.

Leave a Reply