YS Jagan: పులివెందుల ZPTC ఫలితంపై జగన్ సంచలన ట్వీట్

పులివెందుల ZPTC ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికలో పోస్టు చేస్తూ, “అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతి, ప్రేమ, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు” అని జగన్ తెలిపారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

రెండు చోట్ల టీడీపీ విజయం

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విజయం సాధించింది.

పులివెందుల: టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6,035 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత, పులివెందులో వై.ఎస్.ఆర్.సి.పి కుటుంబ ప్రాబల్యం ఛేదించబడింది.

ఒంటిమిట్ట: టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు.

వైసీపీ ఈ ఫలితాలను తీవ్రంగా ఖండించింది. ఎన్నికలలో రిగ్గింగ్, దౌర్జన్యాలు జరిగాయని, టీడీపీ ఓటర్లను తరలించిందని ఆరోపించింది. కొన్ని పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ అవసరమని డిమాండ్ చేసింది.

Leave a Reply