ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న – కల్వకుంట్ల కవిత మధ్య జరుగుతున్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పు అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అసభ్య వ్యాఖ్యలకు స్థానం లేదని, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.
మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది.. మహిళల పట్ల అలా మాట్లాడడం సరైంది కాదు.. pic.twitter.com/KJa0RnMbkG
— Ponnam Prabhakar (@Ponnam_INC) July 14, 2025
అలాగే తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై కవిత అనుచరులు దాడులు చేయడం కూడా సమర్థనీయం కాదు అన్నారు.
“రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయ మార్గాలు ఉన్నాయి. వాటిని వదిలేసి నేరుగా దాడులకు దిగడం తగదు” అని మంత్రి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉన్న గౌరవం గురించి మాట్లాడుతూ.. “మహిళలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవంతో చూడుతుంది. ఈ విషయంలో మా స్థానం స్పష్టంగా ఉంది” అన్నారు.
బీఆర్ఎస్, బిజెపిలు గల్లి లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ లాగా వ్యవహరిస్తున్నారు
బరా బర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం ..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలు పెరుగుతారు.. pic.twitter.com/AKPJGnxsCv— Ponnam Prabhakar (@Ponnam_INC) July 14, 2025
బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వంపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.
“బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడంలేదు?” అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఈ బిల్లును రాష్ట్రపతికి ఆమోదింపజేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలి” అని స్పష్టం చేశారు.
తెలంగాణలో జరిగిన కులగణన కేంద్రాన్ని కదిలించిందని అన్నారు.
“రాష్ట్రం చేసిన ఒత్తిడితోనే కేంద్రం జనగణనతో పాటు కులగణన ప్రకటన చేసింది” అని మంత్రి తెలిపారు.