Perni Nani: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.. మన ప్రభుత్వం వచ్చాక నరికేయండి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. పామర్రు మరియు అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మంత్రి లోకేష్ “రెడ్ బుక్” వ్యాఖ్యలను ఉద్దేశించి, తాము అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి ఆక్రోశించారు.

“చీకట్లో పని అయిపోవాలి.. బయటకు రావొద్దు!”
పేర్ని నాని మాట్లాడుతూ, “చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి.. అరవడం కాదు, నరికేయాలి. తర్వాత ఏమైందని పరామర్శించాలి. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికేయాలి” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ప్రత్యర్థులపై పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తీవ్ర వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వీడియోలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తప్పుడు వేషాలు వేసే వాళ్లను మన ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిగా కట్టడి చేయాలని, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Leave a Reply