ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా, రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం.
పోలీసులు పేర్ని నానిపై BNS యాక్ట్ 353(2), 351(3) కింద కేసులు బుక్ చేశారు. గత కొద్దిరోజులుగా దెందులూరు రాజకీయాలు టీడీపీ-వైసీపీ మధ్య భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ కేసు నమోదు కావడంతో, ప్రాంతీయ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పుడు నానిని పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేక మరే చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది.
లండన్ నుంచి వచ్చాడు సాఫ్టుగా ఉన్నాడు అనుకుంటున్నావేమో..
ఆయన వెనుక జగన్ ఉన్నాడు..🔥
'చింతమనేనికు పేర్ని నాని స్వీట్ pic.twitter.com/JyrYGPdw9B
— jagan siva Reddy (@manikanta953572) August 22, 2025
ఇటీవల దెందులూరులో టీడీపీ శ్రేణులు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన వ్యవసాయ క్షేత్రంపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన పేర్ని నాని, శైలజానాథ్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు దెందులూరు వెళ్లి అబ్బయ్య చౌదరిని పరామర్శించారు. అక్కడి ఆస్తుల నష్టం పరిశీలించిన నేతలు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చింతమనేని బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. అలాగే అబ్బయ్య చౌదరిని చంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పోలీసులు వైసీపీ నేతల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల చరిత్ర చూస్తే, దెందులూరు నియోజకవర్గం టీడీపీ-వైసీపీ మధ్య రాజకీయ పోటీకి హాట్‌స్పాట్‌గా ఉంది. 2009, 2014లో చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరఫున గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అబ్బయ్య చౌదరిని బరిలోకి దింపగా, చింతమనేని ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పలు కేసుల్లో చింతమనేనిని జైలుకు పంపింది. అప్పటి నుంచి నియోజకవర్గ రాజకీయాలు వైసీపీ Vs టీడీపీగా మరింత ఉధృతమయ్యాయి.
గుంటూరు మిర్చి యార్డ్ లో "మిర్చి టిక్కిల దొంగ " అప్పిరెడ్డి,
బందరు "బియ్యం దొంగ" పేర్ని నాని!
ఈ దొంగలు ఇద్దరూ "చేపల దొంగ" అబ్బయ్య ని పరామర్శించడానికి వచ్చారు 😄#ChintamaneniPrabhakar
మిత్రుడి ఫేస్బుక్ నుంచి pic.twitter.com/LHy9vdXME9— Ravi Vallabhaneni (మహానాడు 2025) (@ravivallabha) August 24, 2025
ప్రస్తుతం పేర్ని నానిపై నమోదైన ఈ కేసు.. దెందులూరు రాజకీయ వాతావరణాన్ని మళ్లీ కుదిపేస్తోంది. పరిస్థితి ఏ దిశగా వెళ్తుందోనన్న ఆందోళన ప్రాంతీయ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.