ఏపీ ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్? చంద్రబాబు కీలక నిర్ణయం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నాలుగు రోజుల పాటు పరిపాలనా వ్యవహారాలు సజావుగా కొనసాగేందుకు ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమించనున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చంద్రబాబు ఈ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్‌ వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో రాష్ట్ర పరిపాలనలో ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్‌ను తాత్కాలిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్‌కు ఈ బాధ్యతలు ఇవ్వడం ఒక కీలక నిర్ణయం అవుతుందని చెబుతున్నారు.

జనసేన శ్రేణుల్లో ఉత్సాహం!
పవన్ కళ్యాణ్ ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారన్న వార్త జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యమంత్రిగా తన సామర్థ్యం, పరిపాలనా దక్షతను నిరూపించుకునే మంచి అవకాశం ఇది అని జనసేన నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.

Leave a Reply