పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటన.. 13 మంది మృతి.. 12 మంది పరిస్థితి విషమం..!

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి గాయాలయ్యాయి. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి గ్రౌండ్ +2 అంతస్తుల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలింది. పై అంతస్థుల్లో పనిచేస్తున్న కార్మికులు కింద పడిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల నుంచి బాధితులను వెలికి తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు భారీగా కృషి చేస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే రెస్క్యూ ఆపరేషన్ మొదలైందని తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, మొత్తం 34 మందిని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. గాయపడిన వారిలో 12 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ఉన్నట్లయితే తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులే. ప్రమాద తీవ్రతను బట్టి వారిని వెంటనే హైదరాబాద్ లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు:

నగ్నజిత్ బారి (20) – ఒడిశా

రామ్ సింగ్ (50) – ఒడిశా

రాంరాజ్ (25) – బిహార్

రాజశేఖర్ రెడ్డి (40) – ఆంధ్రప్రదేశ్

సంజయ్ ముఖయా (25) – బిహార్

ధన్ బీర్ కుమార్ దాస్ (28) – బిహార్

నీలాంబర్ (19) – ఒడిశా

సంజయ్ కుమార్ యాదవ్ (28) – ఒడిశా

గణేశ్ కుమార్ (26) – బిహార్

దేవ్ చంద్ (30) – బిహార్

యశ్వంత్ (30) – విజయవాడ

అభిషేక్ కుమార్ – బిహార్

నాగర్ జిత్ తివారి – ఒడిశా

Leave a Reply