నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ గారు మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి.
దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) కుటుంబానికి ఇది పెద్ద దెబ్బగా మారింది. ఆయన రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ (Nandamuri Jayakrishna) సతీమణి పద్మజ గారు శ్వాస సమస్య కారణంగా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.
నందమూరి ఇంట్లో విషాదం
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) మృతి
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు
కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న సీఎం చంద్రబాబు#nandamurifamily #viral #LatestNews pic.twitter.com/FZn5GnN2Mq
— Volganews (@Volganews_) August 19, 2025
నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నతనంలోనే కన్నుమూయగా, జయకృష్ణ కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకున్నారు. పద్మజ గారి మరణం నందమూరి కుటుంబానికి, వారి అభిమానులకు తీరని లోటుగా మారింది.
ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు సంతాపం తెలియజేశారు. నందమూరి కుటుంబం – దగ్గుబాటి కుటుంబం మధ్య ఉన్న బంధం కారణంగా ఈ మరణం మరింత బాధాకరంగా మారింది.
బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2025
ప్రతి కుటుంబ శుభకార్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే పద్మజ గారి మరణం నందమూరి వారసత్వానికి తీవ్ర నష్టం అని పలువురు పేర్కొంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక జయకృష్ణ కుటుంబం సినీ రంగంతోనూ సంబంధం కలిగి ఉంది. ఆయన కుమారుడు చైతన్యకృష్ణ హీరోగా రెండు సంవత్సరాల క్రితం “బ్రీత్” అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.