నల్గొండలో లవర్ కోసం 15 నెలల కొడుకును బస్టాండ్‌లో వదిలేసిన మహిళ..!

నల్గొండ జిల్లాలో అమానవీయమైన సంఘటన ఒక మహిళ చేత చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం ఓ తల్లి తన 15 నెలల చిన్న బిడ్డను బస్టాండ్‌లో వదిలేసి పారిపోయింది.

హైదరాబాద్‌కు చెందిన నవీనకు ఇన్‌స్టాలో నల్గొండ పాతబస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. నవీనకు ఇప్పటికే వివాహం జరగడంతో పాటు 15 నెలల బాబు ఉన్నప్పటికీ, ఆమె భర్తను, తన చిన్నబిడ్డను వదిలి ప్రియుడితో తప్పించుకోవాలని పెద్ద ప్లాన్ రూపొందించింది.

నవీన తన బిడ్డతో కలిసి నల్గొండ RTC బస్టాండ్‌కు వచ్చి, బిడ్డను అక్కడ వదిలేసి బస్టాండ్‌లో ఓ చిప్స్ ప్యాకెట్ ఇచ్చి కూర్చొబెట్టింది. అప్పుడు మెల్లిగా తన లవర్‌తో బైకుపై వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ బిడ్డ తల్లి కోసం గాలించగా, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రయాణికులు పిల్లాడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలనలో నవీన తన బిడ్డను వదిలేసి ప్రియుడితో బైక్‌పై వెళ్లిపోవడం స్పష్టమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బిడ్డను ఆమె భర్తకు అప్పగించారు.

ఈ సంఘటన స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది.

Leave a Reply