కేటీఆర్‌కు మైనంపల్లి మాస్ కౌంటర్.. బిడ్డా, ఈసారి డైరెక్ట్‌గానే అటాక్..!

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఇటీవల ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన, “మా నాయకులను వేధిస్తున్న ప్రతిఒక్కరి పేరు రాసిపెట్టండి. ACPలు, DCPలు ఎవరైనా సరే, మేము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి ఇస్తాం. నేను అసలే మంచోడిని కాదని, ఈసారి కేసీఆర్ చెప్పినా వినను” అంటూ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు.

కేటీఆర్ ఈ వ్యాఖ్యలకు మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించారు. “కేటీఆర్ జీవితంలో సీఎం అవ్వడం అసంభవం. కాంగ్రెస్ కార్యకర్త జోలికొస్తే బిడ్డా, ఈసారి డైరెక్ట్‌గానే అటాక్ చేస్తాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించాడు. కానీ త్వరలోనే సిరిసిల్ల ప్రజలు అతడికి బుద్ధి చెప్తారు” అని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా కేటీఆర్ ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడితే, అతడి అరాచకాలపై పుస్తకం రాసి గడపగడపకూ పంచుతానని మైనంపల్లి వార్నింగ్ ఇచ్చారు.

ఇక కేటీఆర్ అనేక కుటుంబాలను ఆగం చేశారని, ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల మాటలు విన్నాడని, IAS, IPS అధికారుల జీవితాలు కూడా నాశనం చేశాడని మైనంపల్లి ఫైర్ అయ్యారు. “నీ బావ హరీశ్‌రావుతో పాటు నిన్ను సీఎం రేవంత్ ఎందుకు వదిలేస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముకున్నావు, త్వరలోనే జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ పెట్టావు, కానీ అక్కడ దిక్కుదివాన లేని స్థితి” అంటూ మైనంపల్లి తనదైన స్టైల్లో కేటీఆర్‌కు మాస్ కౌంటర్ ఇచ్చారు.

Leave a Reply