క్రికెట్ ప్రేమికులకు ధోని పేరు వినగానే గూస్‌బంప్స్ రావడం సహజం. బ్యాట్ పట్టిన క్షణంలోనే స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఇక ధోని అంటే క్రికెట్ మాత్రమే కాదు, సినీ అభిమానుల్లో కూడా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ధోని స్టేడియంలో బ్యాట్‌తో మెరవడం చూడాలనుకునే వాళ్లుంటే, తెరపై స్టైలిష్‌గా కనిపించేందుకు ఎదురుచూసేవాళ్లు మరింత ఎక్కువ.
ఇక మరోవైపు, మాస్ మేకింగ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా! ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపి, ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్‌ను షేక్ చేసి, ఇటీవల ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా తన మార్క్ చూపించాడు. ఆ సినిమా హీరో ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉండడంతో, సందీప్ స్టైల్‌కి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
ఇప్పుడీ మాస్ డైరెక్టర్ సందీప్ – క్రికెట్ లెజెండ్ ధోని కలిసి పని చేస్తే? ఆ కాంబో ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా? కానీ ఈ కలయిక సినిమా కోసం కాదు, ఓ అదిరిపోయే యాడ్ కోసం!
ఈ-మోటోరాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ కంపెనీ ప్రమోషన్ కోసం వీరిద్దరూ కలిసి ఒక మైండ్ బ్లోయింగ్ యాడ్ చేశారు. ఈ యాడ్‌లో ధోని లుక్ కట్టిపడేస్తుంది. ధోని తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్ స్టైల్‌లో ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే లుక్‌ను మరోసారి తెరపై రీ-క్రియేట్ చేశారు.
యాడ్ ప్రారంభంలో నాలుగు కార్లు రయ్ రయ్ మంటూ దూసుకొస్తాయి. ఒక్కసారిగా ధోని స్టైలిష్‌గా, నల్లని గాగుల్స్, బ్లూ కోట్‌లో కారు డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు. నోట్లో టూత్ పిక్, వెనక బాడీగార్డ్స్ గన్స్ పట్టుకుని.. ఒక మాస్ లుక్ వేస్తాడు. ఆ తర్వాత ధోని సైకిల్ నడిపి వెళ్లడం, ఇదంతా కూల్‌గా ఉండేలా తీసిన విధానం ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.
ఇదంతా చూస్తూ ఉండగానే.. సందీప్ రెడ్డి వంగా ఒక గట్టిగా కట్ కట్! అంటూ విజిల్ వేస్తాడు. వెంటనే “మైండ్ బ్లోయింగ్.. ఫెంటాస్టిక్!” అంటూ కామెంట్ చేస్తాడు.
ఈ యాడ్ ప్రోమో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా మాస్ మేకింగ్‌కి, ధోని స్టైల్‌కి ఇది పర్ఫెక్ట్ కాంబో అనిపిస్తోంది. ఈ ఇద్దరూ భవిష్యత్తులో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది.
ఇలా మొత్తంగా, సందీప్ – ధోని కాంబో అదిరిపోయిందనే చెప్పాలి!
My favourite animal is when DHONI remembers who he is 🔥 pic.twitter.com/Jgr3MDO28f
— EMotorad (@e_motorad) March 18, 2025