మహ్మద్ అజరుద్దీన్ తెలంగాణ కేబినెట్‌లోకి – రేపు మంత్రిగా ప్రమాణం

మాజీ భారత క్రికెట్ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజరుద్దీన్ రేపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.  తెలంగాణ కేబినెట్‌లో ముస్లిం మంత్రులు లేకపోవడం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అజరుద్దీన్‌ను గవర్నర్ కోటా కింద విధాన మండలి (MLC) సభ్యుడిగా నియమించడం ద్వారా ఆయనకు మంత్రిపదవికి అర్హత కల్పించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ ముస్లిం ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అజరుద్దీన్ వయసు 62 సంవత్సరాలు. ఆయన 1980–1990 దశకంలో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్‌లో చోటు కల్పించేందుకు ముందడుగు వేశారు.

అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం రేపు (అక్టోబర్ 31, 2025) న హైదరాబాద్‌లో జరగనుంది.

Leave a Reply