MLA Kannababu Raju: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పరాభవం
MLA Kannababu Raju: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పరాభవం ఎదురైంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎమ్మేల్యే శంకరనారాయణలకు నిరసన సెగలు ఎదురయ్యాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. యలమంచిలి, పెనుగొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది.
యలమంచిలి అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ తగిలింది. పూడిమడక జెట్టీ నిర్మాణహామీని డిమాండ్ చేయగా ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. కాగా వివరాలలోకి వెళ్తే యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజును గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలపై స్థానికులు నిలదీశారు.
కన్నబాబురాజు పోవాలి జగన్ రావాలంటూ నినాదాలు చేశారు. జనం ప్రశ్నిస్తుంటే సహనం కోల్పోయిన కన్నబాబు రాజు వారిపై చేయి చేసుకున్నారు. పూడిమడక గ్రామంలో గడప గడపకూ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. దాంతో తోపులాట చోటుచేసుకుంది. ఆగ్రహంతో చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహారంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం గోబ్యాక్ అంటూ నినదించారు.
కాగా MLA Kannababu Raju అరాచకాలు జగన్ వరకూ చేరాలని కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కన్నబాబు దందాలను అరికట్టాలని.. ఆయన అరాచకాలు అడ్డుకోవాలన్నారు. తప్పులు చేస్తారు.. చేయిస్తారంటూ ప్లకార్డులు తీసుకొచ్చి నిరసనకు దిగారు. వీరిలో సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను స్థానికులు మరోసారి అడ్డుకోవడం తాజాగా చర్చనీయాంశమైంది.
అలాగే పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఈదులపాలపురం వెళ్లగా జనం సమస్యల చిట్టా విప్పి నిరసన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మౌనంగా అక్కడ నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోతుండడంతో స్థానికులు ఎమ్మెల్యే కారుపై చెప్పులు విసిరారు.