Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కోర్టు మెట్లెక్కించిన GHMC.. అసలేం జరిగింది..?

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు షాకిచ్చారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చిరు, చివరికి హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించాల్సి వచ్చింది.

ఏం జరిగింది?
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చిరంజీవికి సొంత నివాసం ఉంది. 2000లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని అనుమతులు తీసుకొని ఆ ఇంటిని నిర్మించారు. ఇప్పుడు దాదాపు 25 ఏళ్లు కావడంతో ఇంటికి రినోవేషన్‌తో పాటు కొన్ని మార్పులు చేయాలని మెగాస్టార్ నిర్ణయించారు.

ఈ మార్పుల కోసం GHMCకి దరఖాస్తు చేసుకున్న చిరంజీవి, అవసరమైన వివరాలన్నీ సమర్పించారు. అయితే దరఖాస్తు చేసి నెల రోజులు గడిచినా అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చిరు అసహనానికి గురై హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆగ్రహం
మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, కోర్టు GHMC అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “అక్రమ నిర్మాణాలకు మాత్రం అధికారులు మద్దతు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి, అయితే సక్రమంగా దరఖాస్తు చేసిన నిర్మాణాలకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు?” అని కోర్టు నిలదీసింది.

తక్షణమే అనుమతులు ఇవ్వాలని ఆదేశం
చిరంజీవి ఇంటి రినోవేషన్ పనులకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోర్టు GHMC అధికారులను ఆదేశించింది.

Leave a Reply