వివాహ సమస్యలతో మనస్తాపానికి గురైన యువకుడు.. మేడ్చల్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య

మేడ్చల్–మాల్కాజిగిరి జిల్లా ఘాట్‌కేసర్ సమీపంలోని మాధవ్ రెడ్డి బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా అత్మకూర్‌కు చెందిన యువకుడు నరేష్ (30) రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది.

నరేష్ హైదరాబాద్‌లోని ఆమీరపేట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ మరియు దుస్తుల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా వివాహ సంబంధాల కోసం ప్రయత్నించినా సరైన జత దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

అతని మనసులో ఉన్న ఒత్తిడి, బాధ చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునే స్థితికి నెట్టేసిందని అనుమానిస్తున్నారు. నవంబర్ 12 ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply