హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్‌పై విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన రామిరెడ్డి అనే వ్యక్తిని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్ల రామిరెడ్డి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి దుర్గం చెరువులోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ వరద నీరు వెళ్లేందుకు ఉన్న హోల్స్‌ను శుభ్రం చేస్తున్న DRF సిబ్బంది గమనించారు. వెంటనే స్పందించిన వారు చాకచక్యంగా అతన్ని అడ్డుకొని కాపాడి, మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
దుర్గంచెరువులో దూకబోతున్న…
యువకుడిని కాపాడిన హైడ్రాశుక్రవారం.. సమయం సాయంత్రం 6.30 గంటలు…హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది దుర్గం చెరువు తీగల వంతెనపై వర్షపు నీరు నిలవకుండా.. కిందకు వెళ్లే రంద్రాలను శుభ్రం చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు తీగల వంతెన నుంచి దుర్గంచెరువులో… pic.twitter.com/yx5siQNyyS
— HYDRAA (@Comm_HYDRAA) July 25, 2025
రామిరెడ్డికి పెళ్లై ఒక కూతురు కూడా ఉంది. అయితే మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు పెట్టేవాడని తెలుస్తోంది. ఈ కారణంగా భార్య కూతురితో కలిసి ఇంటిని వదిలి వెళ్లిపోవడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రామిరెడ్డిని అతని సోదరికి అప్పగించి, కౌన్సెలింగ్ కూడా అందించారు.