LIC Recruitment: ఎల్‌ఐసీలో భారీ ఉద్యోగాలు.. నెలకు లక్షలకు పైగా జీతం!

భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో ఉద్యోగం కావాలనుకునే వారికి శుభవార్త. ఎల్‌ఐసీ భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల కోసం మొత్తం 841 ఖాళీలు ఉన్నాయి.

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు – 81

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 410

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) – 350

ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ licindia.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం & ఫీజులు

ఎంపికైన వారికి నెలకు గరిష్టంగా ₹1,69,000 వరకు జీతం లభిస్తుంది.

SC/ST/దివ్యాంగ్ అభ్యర్థులకు ఫీజు ₹85 + లావాదేవీ రుసుము + జీఎస్టీ.

ఇతర అభ్యర్థులకు ఫీజు ₹700 + లావాదేవీ రుసుము + జీఎస్టీ.

సెలెక్షన్ ప్రాసెస్

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:

ప్రిలిమినరీ పరీక్ష – మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యేంత వరకే.

మెయిన్స్ పరీక్ష – తుది మెరిట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇంటర్వ్యూ – మెన్షన్ చేసిన పోస్టులకు అవసరమైన నైపుణ్యాలను పరీక్షిస్తారు.

మెయిన్స్ పరీక్షలో ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, ఆర్థిక వ్యవహారాలు, లాజికల్ అబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ వంటి అంశాలు ఉంటాయి.

ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోండి.

Leave a Reply