నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని, నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేరస్తులు ప్రయత్నించినా తప్పించుకోలేరని, నిజం ఎప్పుడూ గెలుస్తుందని పేర్కొన్నారు.

ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన బండి సంజయ్, మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

కేసులో స్పందించిన కేటీఆర్, బండి సంజయ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని, ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులో బండి సంజయ్ చేసిన నిరాధార ఆరోపణల వల్ల తన పరువుకు నష్టం కలిగిందని తెలిపారు.

కేటీఆర్ తరపు న్యాయవాదులు హెచ్చరించారు, నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా బండి సంజయ్ స్పందించకపోతే, సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply