తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమైంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి బయటపడుతూ, ఈసారి భారీ విజయాన్ని సాధించేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
పార్టీ బలోపేతం కోసం ముందుగా స్టూడెంట్ వింగ్‌ను బలపరచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న ఉప్పల్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్‌రావు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ నెల 19 వ తేదీ శనివారం నాడు ఉదయం 10 గంటలకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ లోని VNR గార్డెన్స్ లో బిఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కలదు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభ సెషన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు గారు పాల్గొంటారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత… pic.twitter.com/8be19TZFse
— Balka Suman (@balkasumantrs) July 15, 2025
ఈ శిక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టే వ్యూహాలు, బీఆర్ఎస్ విజయాలను ప్రజలకు ఎలా చేరవేయాలో వివరించనున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV)ను మరింత బలంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.