మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి విస్తరణలో తనకు మంత్రిత్వ పదవి దక్కకపోవడంపై ఆయన చిర్రెత్తిపోయి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై హద్దులు దాటి ఎటాక్ చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్ తన భాషను మార్చుకోవాల్సిందే. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం చేసేది ఏమిటో చెప్పాలి’’ అన్నారు. అంతేకాదు, ‘‘ఇప్పటికీ 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు’’ అంటూ ఆరోపణలు చేసారు.
Breaking News 🚨
మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సీఎం తన భాష మార్చుకోవాలి..
ప్రతిపక్షాలను తిట్టడం మానేసి… ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి..
20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటుంన్నారు..
నాకు…
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) August 6, 2025
విస్తరణ ముందు పార్టీబద్ధంగా తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ తర్వాత వెనక్కి తగ్గిందని రాజగోపాల్ ఆరోపించారు. ‘‘నాకంటే జూనియర్లకు పదవులు ఇచ్చారు.. పార్టీ అనుభవజ్ఞులను నిర్లక్ష్యం చేస్తోంది’’ అని చురకలు వేసారు. మంత్రి కావాలంటే ఇప్పటికే కేసీఆర్ ఇచ్చేవాడంటూ విమర్శిస్తూ.. తన పదవి విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదని కూడా పేర్కొన్నారు.
మరిన్ని ఆరోపణలు చేస్తూ, ‘‘రేవంత్ మరో మూడున్నరేళ్లు సీఎం, తర్వాత ఎవరు వస్తారో చూడాలి. కలిసే ఉన్నందువల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కమిషన్ల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారు’’ అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, ‘‘కాలేశ్వరం అవినీతిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
20 నెలల నుండి ప్రతిపక్షాలను తిట్టి తిట్టి.. ఈ తిట్లు వినలేక ప్రజలు రేవంత్ రెడ్డిని అసహ్యించుకుంటున్నారు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి https://t.co/3wRbjwAebi pic.twitter.com/rAZqkYBDTh
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2025
సీఎం రేవంత్ గతంలో సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేస్తూ ‘‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్టుంది’’ అంటూ సెటైర్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉంది అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.