Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ..!

బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ దంపతులకు శుభవార్త. కియారా తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది మొదటి సంతానం కావడం విశేషం.

ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ శుభవార్తతో రెండు కుటుంబాల్లోనూ, అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. సిద్ధార్థ్ – కియారా జంట కూడా ఈవిషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

గత ఫిబ్రవరి 28న వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని పంచుకున్నారు.

కియారాను డెలివరీ కోసం ముంబై గిర్గావ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త తెలిసిన వెంటనే సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)


గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్లో సిద్ధార్థ్ – కియారా వివాహం జరిగింది.

Leave a Reply