సాధారణ వైద్య పరీక్షల నిమిత్తంగా గురువారం బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ కూర్చుని వివరంగా మాట్లాడారు.
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటయిన బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారినీ పలువురు పార్టీ నేతల తో పరామర్శించేందుకు వెళ్లము.
ఈ సందర్భంలో అధినేత తో ఇష్టాగోష్టి నిర్వహించాము.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు,… pic.twitter.com/SmeXLppaUF
— Dr.Errolla Srinivas (@DrErrolla) July 4, 2025
రాష్ట్రంలో ప్రస్తుత సమస్యలు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, సాగునీటి పరిస్థితి, వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లు వంటి అంశాలపై కేసీఆర్ నేతలతో చర్చించారు. ఉద్యమాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా ఆయన సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. అందులో కేసీఆర్ ఫుల్ ఎనర్జీతో, యాక్టివ్‌గా కనిపించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
యశోద ఆస్పత్రిలో పార్టీ నాయకులతో మాట్లాడుతున్న పెద్ద సార్ 🙏
మీరే మాకు కొండంత ధైర్యం కేసీఆర్ సార్ ❤️ pic.twitter.com/Fe156airdI
— Ibrahim Khan (@IbrahimKhanHyd) July 4, 2025
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే కేసీఆర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లామని, బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్‌ను చెక్ చేయడం జరుగుతోందని వివరించారు. వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజులు హాస్పిటల్లోనే ఉంటారని చెప్పారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, ఎలాంటి టెన్షన్ అవసరం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ప్రేమించి, ఆరోగ్యంపై ఆరా తీస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.