తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. నిజామాబాద్‌లో తాను ఎదుర్కొన్న ఓటమి వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని, ఈ విషయం తన తండ్రి కేసీఆర్‌కు కూడా తెలుసని పేర్కొన్నారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.
‘తప్పకుండా ఒకరోజు సీఎం అవుతాను’ అని ధీమాగా చెప్పిన కవిత.. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి పార్టీని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. ‘జాగృతి, బీఆర్ఎస్ రెండూ బలంగా ఉండాలి’ అంటూ అభిప్రాయాన్ని వెల్లడించారు.
సంతోషం గురించి పదేపదే చెప్తూ కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో పరోక్షంగా చెప్పిన కవిత#Telangana #Hyderabad #BRS #KTR #BJP #RevanthReddy #Congress pic.twitter.com/Bqikv8KKci
— Telugu Galaxy (@Telugu_Galaxy) July 3, 2025
తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి కావలసినంత మద్దతు రాలేదు.. తన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నా.. ‘కేటీఆర్‌తో లేఖ లీక్ తర్వాత కొంత దూరం ఏర్పడింది’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ గురించి మాట్లాడుతూ, ‘ఆయన దేవుడు లాంటోడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అన్నారు. గత 11 ఏళ్లుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలా నిజామాబాద్ అభివృద్ధి కాలేదు.. ఎన్ని సార్లు నిధులు అడిగినా ఇవ్వలేదు.. తన మార్క్ చూపించాలనుకున్నా చేయనివ్వలేదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నాడు అని @RaoKavitha ఎవర్ని ఉద్దేశించి చెప్తున్నారు ??
తన ఆవేదన చెప్పుకోవడానికేనా కవిత ఈ పోడ్కాస్ట్ లో మాట్లాడింది? pic.twitter.com/ZfDtfGtKd6— BRS CHARGESHEET (@BRSChargesheet) July 3, 2025
తాను జైలుకుపోతాడని ముందే కేసీఆర్ చెప్పిన సంగతి.. జనవరిలో తనను, భర్త అనిల్‌ను పిలిచి ధైర్యంగా ఉండమన్నారన్న విషయం.. లాయర్ ఫీజులు కూడా స్వయంగా కేసీఆరే చెల్లించిన విషయం.. ఇలా వ్యక్తిగత స్థాయిలో జరిగిన విషయాలను కవిత వెల్లడించారు.
ఇప్పుడు కాకపోయినా, పదేళ్లు లేదా పదిహేను ఏళ్ల తర్వాత అయినా తప్పకుండా ముఖ్యమంత్రి అవుతా.. అని ఆమె చెప్పిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తెరకి దారితీశాయి.