బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తరువాత తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత, ఈ సందర్భంగా పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు, అలాగే భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టంగా తెలిపారు.
#Kavitha resigns from the post of MLC and #BRS party membership following her suspension from the party pic.twitter.com/LU6qjdF3yX
— Aneri Shah Yakkati (@tweet_aneri) September 3, 2025
“ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఈ రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో సమర్పిస్తాను. నేను ఏ ఇతర పార్టీలోనూ చేరను. అలాంటి అవసరం కూడా లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోను. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమే తీసుకుంటాను. ఇకపై నా రాజకీయ ప్రయాణం ప్రజలతోనే ఉంటుంది,” అని కవిత స్పష్టం చేశారు.
