తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ గట్టి సవాల్ విసిరారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని పదేపదే డిమాండ్ చేస్తున్న సీఎం రేవంత్‌కు ప్రతిస్పందనగా, “మీతో చర్చకు సిద్ధంగా ఉన్నాం” అంటూ కవిత స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ:
“మహిళలంతా కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తాం. మీరు హామీ ఇచ్చిన రూ.2,500 నజరానా, తులం బంగారం ఇస్తామన్న విషయాలపై చర్చిద్దాం. అలాగే పింఛన్లు, సంక్షేమ పథకాల పెంపుపై కూడా మాట్లాడదాం” అని రేవంత్‌కు సవాల్ విసిరారు.
బీసీ రిజర్వేషన్లపై రైల్‌రోకో హెచ్చరిక
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ జాగృతి జిల్లా విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరగా, కవిత వారికి కండువా కప్పి స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ప్రజలు వాటిని గమనిస్తున్నారని విమర్శించారు.. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే, బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.. కాంగ్రెస్ హామీ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 17న రైల్‌రోకో కార్యక్రమం చేపడుతున్నామని, బీసీలు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
ఆంధ్రాలో కలిపిన భద్రాచలం చుట్టు పక్కల 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి. అన్యక్రాంతమవుతున్న రాములవారి భూములను కాపాడాలి – ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/mGHZjuehXy
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) July 10, 2025
భద్రాచలం భూములపై స్పందన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా ఉందని, వాటిని తెలంగాణలో కలిపే దిశగా తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకోవాలని కోరారు.
పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయ భూములు పరిశీలించేందుకు వెళ్లిన BC మహిళా అధికారులు.. ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండించిన కవిత.. ‘భద్రాచల రాముడు తెలంగాణ దేవుడు’ అంటూ స్పష్టం చేశారు.