Sanjay Kapoor Passes Away: స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో కన్నుమూశారు. వయసు 53 సంవత్సరాలు. యూకేలోని పోలో మ్యాచ్‌లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత విభేదాల కారణంగా ఇద్దరూ 2016లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. 2017లో ఆయన ప్రియా సచ్‌దేవ్‌ను రెండో వివాహంగా చేసుకున్నారు.

సంజయ్ ఆకస్మిక మరణం చిత్రపరిశ్రమలో దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరిష్మా కపూర్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

సంజయ్ పోలో ఆడుతూ మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. సంజయ్ వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా, బాలీవుడ్‌కు తన వ్యక్తిగత జీవితంతోనూ చర్చనీయాంశంగా మారిన వ్యక్తి.

Leave a Reply