Bathukamma 2025: కవిత బతుకమ్మ 2025 షెడ్యూల్ విడుదల.. చింతమడక నుంచి లండన్ వరకు!

తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మ (Bathukamma 2025) వచ్చేస్తోంది. ఈ నెల 21 నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ గుర్తింపు తెచ్చుకున్న కల్వకుంట్ల కవిత ఈసారి కూడా తన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఉద్యమ సమయంలో బతుకమ్మను తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన కవిత, ఇప్పుడు బీఆర్ఎస్‌కి దూరం అవుతూ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం మధ్య ఈ వేడుకలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

కవిత బతుకమ్మ షెడ్యూల్:

21 సెప్టెంబర్ – ఎంగిలిపూల బతుకమ్మ @ చింతమడక (సిద్దిపేట జిల్లా)

22 సెప్టెంబర్ – తెలంగాణ జాగృతి కార్యాలయం, హైదరాబాద్

23 సెప్టెంబర్ – శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా)

24 సెప్టెంబర్ – వర్గల్ అమ్మవారి దర్శనం (సిద్దిపేట జిల్లా)

25 సెప్టెంబర్ – హర్యానా, మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి ఉత్సవాలు

26–28 సెప్టెంబర్ – విదేశాల్లో బతుకమ్మ వేడుకలు

26 – ఖతార్

27 – మాల్టా

28 – లండన్

ఇటీవల చింతమడక గ్రామస్తులు కవితను కలసి, సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనమని ఆహ్వానించారు. చింతమడక ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో ఉండగా, అక్కడ హరీష్ రావు బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఆయన భారీ మెజార్టీలతో గెలుస్తూ వస్తున్నారు.

ఇప్పుడు అదే ప్రాంతంలో కవితకు ఆహ్వానం రావడం, ముఖ్యంగా హరీష్ రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో జరగడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి స్వగ్రామంలో కవిత ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి పెరిగింది.

Leave a Reply