Kavitha – KA Paul : కవితకు కేఏ పాల్ బంపర్ ఆఫర్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. కవితను తన పార్టీలో చేరమని ఆహ్వానిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ‘‘బీసీల కోసం కలిసి పోరాడుదాం. ప్రజల్లో నమ్మకం పొందాలంటే గద్దరన్న చేరిన పార్టీలో చేరాలి’’ అంటూ కేఏ పాల్ పిలుపునిచ్చారు.

తెలంగాణ రాజకీయాల్లో తరచూ సంచలన వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా మారే కేఏ పాల్, మళ్లీ తనదైన స్టైల్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చారు. మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నాయకురాలు కవితను తన ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆ వీడియోలో పాల్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి: ‘‘మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత బీసీల కోసం పోరాడతానని చెబుతోంది. నిజంగా బీసీల కోసం పోరాడాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలి. రా కవిత.. మనం కలిసి జూబ్లీహిల్స్‌లో పోరాడుదాం. నువ్వు బీజేపీ పంపిన భాణం కాదని రుజువు చేసుకో’’ అని పిలుపునిచ్చారు.

అయితే కేఏ పాల్ ఆహ్వానంపై కవిత ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా, ఈ విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే, తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత, బీఆర్‌ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, సంతోష్ రావులే కుట్ర చేశారని ఆరోపించారు. తన ఫ్యామిలీ, కేటీఆర్ కుటుంబ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని కవిత తీవ్రస్థాయిలో ఆరోపించారు. అంతేకాక, తాను తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను కూడా సంతోష్ రావే లీక్ చేశారని వెల్లడించారు.

కవిత చేసిన ఈ సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రకంపనలు రేపుతున్నాయి.

Leave a Reply