పవన్ ఎందుకు మౌనం? డ్రైవర్ రాయుడు హత్యపై చెల్లి సంచలన ఆరోపణలు..!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాయుడు చెల్లి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి భద్రత కోరింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, జనసేన నేతలవైపు నుంచి రూ.30 లక్షలు ఆఫర్ చేసినా తాము ఒప్పుకోలేదని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని డిమాండ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధారణ విషయాలకూ స్పందించే ఆయన, ఈ హత్య కేసులో మాత్రం ఇప్పటివరకు మౌనంగా ఉన్నారని రాయుడు చెల్లి ప్రశ్నించింది. “మాకు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడే అవకాశం ఇవ్వండి” అని డీఎస్పీని ఆమె కోరింది. అంతేకాకుండా, సోషల్ మీడియాలో తమ అన్న గురించి వస్తున్న అక్రమ సంబంధ పుకార్లలో నిజం లేదని, ఆయన అలాంటి వాడు కాదని స్పష్టం చేసింది. అయితే దీనిపై పోలీసులు స్పందిస్తూ, పూర్తి వివరాలు అందిస్తేనే అధికారికంగా ఫిర్యాదు స్వీకరిస్తామని తెలిపారు.

వినూతపై తీవ్ర ఆరోపణలు
ఇదిలా ఉండగా, కోట వినూతకు డ్రైవర్ రాయుడితో అక్రమ సంబంధం ఉందని, కొన్ని వ్యక్తిగత వీడియోల కారణంగా ఈ హత్య జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినూత తన భర్తతో పాటు మరో ఐదుగురితో కలిసి రాయుడిని హత్య చేసినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply