Jagan Govt: సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వనికి చుక్కెదురు

Jagan Govt

Jagan Govt: సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వనికి చుక్కెదురు

Jagan Govtఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మూడు ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ విధించిన  రూ. వంద కోట్ల జరిమానా ,  ప్రాజెక్టుల నిర్మాణంపై స్టేను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రాజెక్టుల నిర్మాణంపై ఇచ్చిన స్టేను తొలగించేందుకు నిరాకరించింది.

అయితే, ఎన్టీజీ ఆదేశాల‌ను ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ సర్కారు పిటిషన్ పై జ‌స్జిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ సుంద‌రేశ్ల‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Also Watch

Gudivada: నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలి

ఏపీ ప్రభుత్వం త‌ర‌పున సీనియర్ న్యాయ‌వాది ముకుల్ రోహత్గీ వాద‌న‌లు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే, ఎన్జీటీ రూ.100 కోట్ల జ‌రిమానా విధించ‌వ‌చ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా స్టే విధించింది.

ఎన్జీటీ రూ.100 కోట్లు జ‌రిమానా విధించ‌డం చ‌ట్టబ‌ద్ధం కాద‌ని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని  కానీ అంత జ‌రిమానా భారం అవుతుందన్నారు.

రూ.100 కోట్ల జ‌రిమానా నిలుపుద‌ల చేయాల‌ని కోర్టును కోరారు. అయితే  ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జ‌మ చేయాలని సుప్రీం ధర్మాసనం ఏపీ సర్కారును ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్కు వాయిదా వేసింది.

ప్రాజెక్టులో జరిగిన మార్పుల విదానాలు

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ప్రభుత్వం యథేచ్ఛగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘంచినట్లు పెంటపాటి పుల్లారావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మేడిచెర్ల సత్యనారాయణ, జమ్ముల చౌదరయ్య ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

దీన్ని విచారించిన ఎన్జీటీ- ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు- 2 కోట్ల 48 లక్షల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టు- కోటి 90 లక్షల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏకంగా 120 కోట్ల రూపాయల పరిహారాన్నివిధించింది. ఈ మొత్తాన్ని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ జాయింట్ కమిటీ- ప్రభుత్వానికి ఆదేశిచింది.

ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

అయితే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెందిన కంపెనీలే టెండర్లు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్జీటీ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పనులు జరిగాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్జీటీ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh