iphone Security: ఐఫోన్ వాడేవారికి సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్.. వెంటనే అవి అప్డేట్ చేయండి!

మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! ఇటీవల భారత ప్రభుత్వం ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వాడేవారికి కీలక హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) తెలిపిన ప్రకారం, యాపిల్ పరికరాల్లో తీవ్రమైన భద్రతా లోపాలు గుర్తించబడ్డాయి.

ఈ లోపాల కారణంగా హ్యాకర్లు మీ ఫోన్‌లోకి సులభంగా ప్రవేశించి వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ అనుమతి లేకుండా కోడ్ రన్ చేయడం, ఫోన్‌ను హ్యాక్ చేయడం, పూర్తిగా పనిచేయకుండా చేయడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు. CERT-In ప్రకారం, ఈ సమస్యలు చాలా తీవ్రమైనవని, ఫోన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని స్పష్టం చేసింది.

ఎవరికి ఈ సమస్య ఎక్కువ?

ప్రత్యేకంగా పాత వెర్షన్ iOS మరియు iPadOS సాఫ్ట్‌వేర్ వాడే పరికరాలు ప్రమాదంలో ఉన్నాయి.

iOS 18.6 కంటే పాత వెర్షన్లు ఉన్న ఐఫోన్లు

iPadOS 17.9.9 కంటే పాత వెర్షన్లు ఉన్న ఐప్యాడ్‌లు

కొంతమంది మ్యాక్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Also Read : విదేశీ వస్తువులు కొనొద్దు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు..!

యాపిల్ పరిష్కారం ఏంటి?

యాపిల్ ఇప్పటికే ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చింది. వినియోగదారులు వెంటనే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

అప్‌డేట్ చేసుకోవడానికి స్టెప్స్:

మీ ఐఫోన్‌లో Settings ఓపెన్ చేయండి.

అక్కడ General ఆప్షన్‌లోకి వెళ్లండి.

Software Update మీద క్లిక్ చేయండి.

కొత్త అప్‌డేట్ కనిపిస్తే, వెంటనే Download & Install చేయండి.

జాగ్రత్తలు:

ఎల్లప్పుడూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

తెలియని లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి.

థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం తప్పించాలి.

కేవలం Apple Storeలోని యాప్‌లను మాత్రమే వాడాలి.

మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఈ సూచనలను తప్పనిసరిగా పాటించండి.

Leave a Reply