Hyderabad MLC Elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్.. ఎంఐఎం అభ్యర్థి ఘన విజయం

హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నప్పటికీ, ఈ రెండు పార్టీలు పోటీలో లేనప్పటికీ ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్‌ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ఎంఐఎం అభ్యర్థి 63 ఓట్లు పొందగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు 25 ఓట్లకే పరిమితమయ్యారు. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించారు. ఓటింగ్ శాతం 78.57% గా నమోదైంది.

ఈ ఎన్నికకు బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉండగా, బీజేపీ మాత్రం ఎంఐఎం ఎదుట పోటీకి దిగడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ప్రారంభం నుంచి ఎంఐఎం విజయం సాధించబోతుందని అంచనాలు ఉన్నా, బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. కానీ అంచనాలకు తట్టకుండా బీజేపీ పరాజయం పాలైంది.

ఇది 22 ఏళ్ల తర్వాత జరగిన ఎన్నిక కావడం విశేషం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడం, బీజేపీ అనూహ్యంగా బరిలోకి దిగడం ఈ ఎన్నికను మరింత హైలైట్ చేసింది. చివరి వరకు రెండు పార్టీల నేతలు తమ ఓటర్లను కలిసి జన సమీకరించేందుకు కసరత్తు చేశారు. అయినా.. చివరికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆశతో ఉన్న బీజేపీకి తీవ్ర నిరాశే మిగిలింది.

Leave a Reply