Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఖజానా జ్యువెలరీ షాప్‌లో భారీ దోపిడీ..!

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు.. ఖజానా జ్యువెలరీ షాప్‌లో భారీ దోపిడీ జరిగింది.

నగరంలో వరుసగా రెండు చోట్ల చోరీలు చోటుచేసుకున్నాయి. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం ఆరుగురు దొంగలు రెండు ఇళ్లలో చోరీలు చేశారు. అక్కడ వృద్ధులను బెదిరించి రూ.2 లక్షల నగదు మరియు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మరో ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని సమాచారం.

ఇక చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్‌లో ఈ ఉదయం ఆరుగురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. షాప్ ఉదయం 10:30 గంటలకు ఓపెన్ అయి సిబ్బంది ప్లెడ్జ్ చేస్తున్న సమయంలో, ఆరుగురు దొంగలు ఒక్కసారిగా దూసుకువచ్చి అసిస్టెంట్ మేనేజర్ సతీష్‌పై కాల్పులు జరిపారు. ఆయన కాలులో బులెట్ దూసుకుపోయింది.

ఈ కాల్పుల కారణంగా షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దొంగలు ఎక్కువగా వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. గాయపడిన సతీష్‌ను దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

వివరాలు తెలుసుకున్న పోలీసులు ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ సేకరించి, నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగలు జహీరాబాద్ వైపు పారిపోయిన కారణంగా జిల్లా సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

Leave a Reply