కేవలం 4 గంటలకే సౌండ్ సిస్టమ్.. రోడ్లకు అడ్డం కాకుండా మండపాలు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ, తన ఇంటి పక్కన మండపాలు ఏర్పాటు చేశారంటూ కోర్టును ఆశ్రయించగా, ఇలాంటి ఫిర్యాదులు మరికొన్ని నమోదయ్యాయి. గతంలోనే పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని హైకోర్టు సూచించినా, అధికారులు పట్టించుకోకపోవడంతో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టు స్పష్టమైన నిబంధనలు:

సౌండ్ సిస్టమ్: సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి.

డెసిబెల్ లిమిట్: నిర్దేశిత స్థాయి మించకుండా కచ్చితంగా నియంత్రించాలి.

సున్నిత ప్రాంతాలు: స్కూల్స్, హాస్పటల్స్, వృద్ధాశ్రమాల దగ్గర లౌడ్ స్పీకర్లు వద్దు.

ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా: మండపాలు రోడ్లకు అడ్డంగా ఉండకూడదు. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉంచాలి.

పవర్ కనెక్షన్: మండపాలకు కరెంట్ అనుమతి తప్పనిసరి.

శుభ్రత: నిమజ్జనాల తర్వాత మండపాల వద్ద ప్రాంతాన్ని నిర్వాహకులు శుభ్రం చేయాలి.

హెల్ప్ డెస్క్‌లు: స్థానికుల ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాలి.

ప్రతిష్టలు: వీలైనంతవరకు కమ్యూనిటీ మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లోనే విగ్రహాలు ప్రతిష్టించాలి.

మండపాల నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply