హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలతో పాటు లడ్డూ వేలంపాట కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లడ్డూలు రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి పనులకు వినియోగిస్తారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యంత ఫేమస్‌గా నిలిచిన మూడు లడ్డూల ధరల వివరాలు చూద్దాం.
బాలాపూర్ గణేష్ లడ్డూ
బాలాపూర్ లడ్డూ వేలంపాట హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధి చెందినది. 1994లో కేవలం రూ.450తో మొదలైన ఈ వేలం, ప్రతి సంవత్సరం పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ లడ్డూను గెలుచుకున్న వారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
2024: రూ.30 లక్షలు
2023: రూ.27 లక్షలు
2022: రూ.24 లక్షలు
2021: రూ.18 లక్షలు
మై హోమ్ భూజా గణేష్ లడ్డూ
రాయదుర్గంలోని మై హోమ్ భూజా గణేష్ లడ్డూ కూడా భారీ ధరలు పలికే వాటిలో ఒకటి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ వేలంలో ఆసక్తిగా పాల్గొంటారు.
2025: రూ.51,07,777 (కొండపల్లి గణేష్, ఖమ్మం)
2024: రూ.29 లక్షలు
2023: రూ.25.50 లక్షలు
2022: రూ.20.50 లక్షలు
2021: రూ.18.5 లక్షలు
కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేష్ లడ్డూ
బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లడ్డూ, గతేడాది అనూహ్యంగా రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ లడ్డూ వేలం రాష్ట్రంలోనే అతి పెద్ద మొత్తానికి అమ్ముడవడం విశేషం.
2024: రూ.1.87 కోట్లు
2023: రూ.1.26 కోట్లు
2022: రూ.60 లక్షలు
2021: రూ.41 లక్షలు
2020: వేలం జరగలేదు (కోవిడ్ కారణంగా)
2019: రూ.18.75 లక్షలు