మందుబాబులకు షాక్‌.. రెండు రోజులు మద్యం షాపులు బంద్..!

హైదరాబాద్ నగర పోలీస్ శాఖ మందుబాబులకు షాక్ ఇచ్చింది. జూలై 13 (ఆదివారం) నాడు జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా, నగరంలోని మద్యం దుకాణాలను రెండు రోజులపాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాల మేరకు:
జూలై 13 ఉదయం 6 గంటల నుంచి – జూలై 15 ఉదయం 6 గంటల వరకు
సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్లలోని మద్యం షాపులు మూసివేయాలి.

ఈ నిర్ణయం కింద కింది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మద్యం షాపులు మూతపడనున్నాయి:

గాంధీనగర్

చిలకలగూడ

లాలాగూడ

వారాసిగూడ

బేగంపేట

గోపాలపురం

తుకారాంగేట్

మారేడ్‌పల్లి

మహంకాళి

రామ్‌గోపాల్‌పేట్

మార్కెట్

బోనాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.

నాలుగు రోజుల నుంచే గస్తీని బలపరిచారు

అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అడిగి విచారిస్తున్నారు

భక్తుల దృష్టిలో కీలక ఘట్టం – భవిష్యవాణి
ఈ ఉత్సవంలో ముఖ్యమైన ఆకర్షణ భవిష్యవాణి.
మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి చెప్పే భవిష్యవాణి నిజం అవుతుందనే భక్తుల గాఢ నమ్మకం ఉంది.
ఈ దృశ్యం చూసేందుకే వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

Leave a Reply