Ganesh Laddu : హైదరాబాద్‌లో రూ.2 కోట్ల 30లక్షలు పలికిన గణేష్ లడ్డూ..!

హైదరాబాద్‌లోని గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లావాసులు శుక్రవారం జరిగిన వినాయక లడ్డూ వేలంలో రూ. 2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు.

గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ. 1.87 కోట్లు పలికింది. ఈ వేలానికి స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా హాజరవుతూ ఉంటారు. ఈసారి వేలం రూ. 1 కోటి నుంచి ప్రారంభమైంది.

బిడ్డింగ్ ఉత్సాహంగా జరిగింది. 80 కంటే పైగా విల్లా యజమానులు నాలుగు గ్రూపులుగా విభజించి, రెండు గంటల్లో దాదాపు 500కి పైగా బిడ్లు వేశారు. చివరగా, పదికేజీల లడ్డూను రూ. 2 కోట్లకు పైగా కొనుగోలు చేశారు.

2018లో కేవలం రూ. 25,000తో ప్రారంభమైన ఈ వేలం, ఇప్పుడు తెలంగాణలో అత్యంత ఖరీదైన పండుగ లడ్డూలలో ఒకటిగా ఎదిగింది. గతంలో కొన్ని రికార్డులు ఇలా ఉన్నాయి:

2019: రూ. 18.75 లక్షలు

2020: రూ. 27.3 లక్షలు

2021: రూ. 41 లక్షలు

2022: రూ. 60 లక్షలు

2023: రూ. 1.26 కోట్లు

2024: రూ. 1.87 కోట్లు

ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయం సాధారణంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.

అలాగే, రాయదుర్గంలోని మై హోమ్ భుజా లడ్డూ కూడా ఫేమస్. ఈ లడ్డూ వేలం ప్రతి సంవత్సరం రికార్డు ధరలకు దూకుతూ ఉంటుంది. ఈ ఏడాది ఖమ్మం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ రూ. 51,07,777కి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది మై హోమ్ భుజా లడ్డూను కూడా ఆయన రూ. 29 లక్షలకు పడ్డారు.

Leave a Reply