హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్లు.. రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్!

హైదరాబాద్‌లో ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఓ కల. ఆ కలను నిజం చేసే సమయం వచ్చేసింది. సరసమైన ధరలు, క్లియర్ టైటిల్స్, పారదర్శక విధానంతో మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఫ్లాట్లు, ఓపెన్‌ ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. బండ్లగూడ (నాగోల్ వైపు), పోచారం (ఇన్ఫోసిస్ సెజ్‌ దగ్గర) వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి.

ధరలు ఇలా ఉన్నాయి:

1BHK ఫ్లాట్లు: రూ. 13 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు

2BHK ఫ్లాట్లు: రూ. 19 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు

అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ ఫ్లాట్లు నిర్మించబడ్డాయి. ఇవి నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉండటంతో పాటు, ఐటీ కంపెనీలు, సెజ్‌లు, యశోద, కామినేని వంటి ప్రముఖ ఆస్పత్రులకు సమీపంలో ఉన్నాయి.

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కూడా ఉంటాయి. వృద్ధుల శ్రేయస్సు దృష్ట్యా సింగిల్ బెడ్రూం ఫ్లాట్లు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. మార్కెట్ ధరల కంటే దాదాపు 40% తక్కువ ధరలకు ఇవి లభిస్తున్నాయని అధికారులు తెలిపారు. చదరపు అడుగు ధర రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య ఉండవచ్చని అంచనా.

దరఖాస్తు గడువులు, లాటరీ తేదీలు:

బండ్లగూడ ఫ్లాట్లు:

దరఖాస్తు చివరి తేదీ: జూలై 29

లాటరీ డ్రా: జూలై 30

సంప్రదించవలసిన నంబర్: 7702977006

పోచారం ఫ్లాట్లు:

దరఖాస్తు చివరి తేదీ: జూలై 31

లాటరీ డ్రా: ఆగస్ట్ 1

సంప్రదించవలసిన నంబర్: 9959989482

ప్లాట్ల వేలం వివరాలు:

EMD చెల్లింపు తేదీలు: ఆగస్ట్ 2 నుంచి 19 వరకు

వేలం తేదీలు: ఆగస్ట్ 4, 5, 6, 20

స్థలాల కోసం సంప్రదించవలసిన నంబర్లు:

కుర్మల్‌గూడ: 8121022230

బహదూర్‌పల్లి: 7999455802

తొర్రూర్: 8688468930

ఆసక్తి ఉన్నవారు లాటరీ పద్ధతిలో ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, అర్హతలు, ప్లాన్‌లు, మ్యాప్‌ల కోసం రాజీవ్ స్వగృహ అధికారిక వెబ్‌సైట్ www.swagruha.telangana.gov.in ను సందర్శించవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో 1342 ప్లాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ సి. భాస్కర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply