ACB Raids: విద్యుత్‌ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.2 కోట్ల నగదు స్వాధీనం

హైదరాబాద్‌ (Hyderabad) మణికొండలో విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (ADE) అంబేద్కర్‌ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచి కొనసాగిన ఈ తనిఖీల్లో, అంబేద్కర్‌ బంధువు ఇంట్లోనే ఏసీబీ అధికారులు రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

మణికొండ, నార్సింగి డివిజన్‌లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్‌ అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.200 కోట్ల విలువైన భూములు, ఫ్లాట్లు, భవనాలు ఆయన బినామీల పేర్లపై ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ద్వారా ఆయన అక్రమాస్తుల పరిమాణం వెలుగులోకి వస్తుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బంధువు ఇంట్లో రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం కావడం సంచలనం రేపుతోంది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply