Heart Stroke: 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన …….

Heart Stroke

Heart Stroke: 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ గుండెపోటుతో మృతి

Heart Stroke:  ఆయన పేరు గౌరవ్ గాంధీ ఆయన గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్.

ఎన్నో వేల మందికి ఆయన గుండె ఆపరేషన్లు చేశారు. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే, చివరకు ఆయనే అనూహ్యంగా గుండెపోటుతో మృతి చెందారు.

అసలు పూర్తి వివరాలలోకి వెళ్ళితే జూన్ 6వ తేదీ రాత్రి వరకు ఆస్పత్రిలో పేషెంట్లను చూసి జామ్ నగర్ ప్యాలెస్ రోడ్డులోని తన ఇంటికి వచ్చారు.

రోజు మాదిరిగానే డిన్నర్ చేసి రాత్రి 11 గంటల సమయంలో నిద్ర పోయారు.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లే డాక్టర్ గౌరవ్.. 2023 జూన్ 7వ తేదీ బుధవారం ఉదయం నిద్ర లేవలేదు.

బయట వర్షం పడుతుండటంతో.. నిద్ర లేవలేదని భావించిన కుటుంబ సభ్యులు.. అతన్ని డిస్ట్రబ్ చేయలేదు.

7 గంటల తర్వాత కూడా నిద్ర లేవకపోవటంతో.. ఇంట్లోని కుటుంబ సభ్యులు నిద్ర లేపారు. ఉలుకూ పలుకూ లేకపోవటంతో.

. భయమేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.

 కానీ 41 ఏళ్ల డాక్టర్ గౌరవ్ నిద్రలోనే తీవ్ర గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు చెబుతున్నారు డాక్టర్లు.

కుటుంబ Heart Stroke:  సభ్యులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి పడుకునే మందు అందరితో మాట్లాడాడని.

. ఎలాంటి అనారోగ్యం అని చెప్పలేదని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

అయితే డాక్టర్‌ గౌర‌వ్ గాంధీతో క‌లిసి ప‌నిచేసే గురు గోవింద్‌సింహ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి చెందిన డాక్ట‌ర్ హెచ్‌కే వాస‌వాడ ఆయ‌న మృతి స‌మాచారాన్ని వెల్ల‌డించారు.

పెద్ద సంఖ్య‌లో గుండె ఆప‌రేష‌న్లు చేసి ఎంద‌రో ప్రాణాలు కాపాడిన ఆయ‌న‌ ఇలా చిన్న వ‌య‌సులోనే అదే గుండెపోటుతో ప్రాణాలు వ‌ద‌ల‌డం తీవ్ర బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే  41 ఏళ్ల వయస్సుకే 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేసిన డాక్టర్ గౌవర్ ఇక లేరన్న విషయం తెలిసి జామ్ నగర్‌లోని డాక్టర్లతోపాటు.

ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా పేరు పొందిన గౌరవ్ అదే గుండెపోటుతో చనిపోవటం వైద్యలోకాన్ని Heart Stroke:  షాక్‌కు గురి చేసింది.

సోషల్ మీడియా వేదికగా డాక్టర్ గౌరవ్‌కు వైద్యులు, ప్రజలు నివాళులర్పించారు.

గుండె జబ్బులపై ఇటీవల కాలంలో గౌరవ్ అనేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారని ఆయన వద్ద చికిత్స పొందినవారు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Leave a Reply