22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హరీశ్ రావు ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందించిన చామల, ఎక్స్ వేదికగా ఇలా పేర్కొన్నారు:
“మీ అధికారం ముగిసే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు ఫుల్, మీరు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు నిల్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఫుల్, యూనివర్సిటీలు, విద్యాలయాల్లో ఫాకల్టీ నిల్లు, రెండు విడతల్లో తెచ్చిన అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్లు, కాళేశ్వరం పేరిట దోపిడి ఫుల్, రైతుల కోసం మీరు చేసింది నిల్లు. మొత్తంగా బీఆర్‌ఎస్ హయాంలో ప్రచారం మాత్రమే ఫుల్, ప్రజలకు మేలు నిల్లు.” అంటూ కౌంటర్ ఇచ్చారు.
బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు ❌
ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు❌
విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు, జాబ్ క్యాలెండర్ బందు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు❌
నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు.. డీజిల్ పోయించేందుకు…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 15, 2025
ఇక, అంతకుముందు హరీశ్ రావు ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా పేర్కొన్నారు:
“బిల్లులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బంద్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బంద్, నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బంద్, డీజిల్ పోయించేందుకు డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బంద్, రైతులకు రుణ మాఫీ బంద్, పంట బోనస్ బంద్, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బంద్, అన్నదాతకు యూరియా బంద్. మొత్తంగా 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బంద్, అభివృద్ధి బంద్. ఎక్కడ చూసినా బంద్, బంద్, బంద్.” అని ఆరోపించారు.
మీ అధికారం పోయేనాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు ఫుల్లు..
మీరు పెట్టిన మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు నిల్లు..
మీరు పోయేనాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఫుల్లు..
యూనివర్సిటీలు, విద్యాలయాల్లో ఫాకల్టీ నిల్లు..
రెండు దఫాల్లో తెచ్చిన అప్పులు ఫుల్లు..
చేసిన అభివృద్ధి నిల్లు..కాళేశ్వరం…
— Kiran Kumar Chamala (@kiran_chamala) September 15, 2025
రేవంత్ రెడ్డి నాయకత్వం దద్దమ్మ పాలనగా మారిందని, ప్రజలు విసిగి వేసారిపోయారని, త్వరలో కాంగ్రెస్ డ్రామాలకు బంద్ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.