బీఆర్ఎస్ పార్టీలో నుంచి మరో కీలక నేత నిష్క్రమించారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ పంపారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నారన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అందుతున్న సమాచారం ప్రకారం, ఆగస్టు 9న గువ్వల బాలరాజు బీజేపీ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్లో సీనియర్ నేతగా కొనసాగిన గువ్వల.. మూడు ఎన్నికల్లోనూ అచ్చంపేట నుంచి గులాబీ పార్టీ తరఫున బరిలోకి దిగారు. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన గువ్వల, 2023లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు.
బీఆర్ఎస్ కు గువ్వల రాజీనామా..
తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..
త్వరలో బీజేపీ లో చేరనున్నట్లు సమాచారం.#GuvvalaBalaraju #Achampet #BRSParty pic.twitter.com/E48Hgsnvfo
— Telugu Reporter (@TeluguReporter_) August 4, 2025
ఓటమి తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ, ప్రస్తుతం నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేవలం వారం రోజుల క్రితమే హరీష్ రావు నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలోనూ పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.