Gunfire America: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
Gunfire America: అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. ఈ ఘటన న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాలలో జరిగింది.
కాల్పులు జరిపిన వ్యక్తిని సంఘటనా స్థలంలోనే పోలీసులు కాల్చి చంపారు. వాయువ్య న్యూ మెక్సికోలో సోమవారం నాడు భయంకరమైన కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఈ దాడిలో ప్రజలే కాకుండా పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయాలకు గురైన ఇద్దరు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఘటన తర్వాత స్కూల్ ను మూసివేశారని, మధ్యాహ్నం తర్వాత మళ్లీ తెరిచేందుకు అనుమతి ఇచ్చారని వెల్లడించారు.
Also Watch
విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. దాదాపు 50,000 మంది జనాభా ఉన్న ఫార్మింగ్టన్లో ఉదయం 11 గంటల ప్రాంతంలో సాయుధుడు కాల్పులు జరిపాడు.
కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదన్నారు. అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
ఈ మద్య కాలంలో అమెరికా లో వరుస కాల్పులు తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న టెక్సాస్లోని ఓ షాపింగ్ మాల్లో ఆగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో 7 మృతదేహాలు లభించాయి. ఆసుపత్రికి తరలించిన క్షతగాత్రుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ కాల్పులకు గురవుతున్న వారిలో భారతీయులు సైతం ఉండడం ఆందోళన వ్యక్తమవుతున్నది.
పుట్టిన దేశాన్ని వదిలి.ఉన్నత చదువులు, ఉద్యోగాల మోజులో అమెరికా బాటపట్టి బిడ్డలు విగతజీవులుగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
ప్రభుత్వేతర సంస్థ గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్లో ఈ సంవత్సరం 215 కంటే ఎక్కువగానే కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
కానీ అమెరికాలో గన్ కల్చర్ అత్యంత ఆందోళనకరంగా ఉంది. 2021లో 49వేల మంది కాల్పులకు ప్రాణాలు విడిచారు. 2020లో ఆ సంఖ్య 45వేలుగా ఉంది.
ఈ ఏడాదిలో ఇప్పటికే అనేక షూటింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు, అంతకన్నా ఎక్కువమంది మరణించి ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి.