Duvvada Srinivas-Madhuri: దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లికి వేణు స్వామి ఆశీర్వాదం..? ఫొటోలు వైరల్!

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటికి వెళ్లిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి మధ్య జరిగిన భేటీపై పెళ్లి సంబందిత ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వేణు స్వామి వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేయబోతున్నారన్న వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిన ఈ జంట ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వీరిద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగి, ప్రస్తుతం విడాకుల కోసం న్యాయపరంగా ప్రయత్నిస్తున్నారు. విడాకులు పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసుకుంటామని గతంలోనే ప్రకటించిన వీరు, ఇటీవల శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. అంతేకాకుండా, ఇక్కడ భారీ ఎత్తున వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ షాప్ ఓపెనింగ్‌లో వేణు స్వామి హాజరవడం అప్పుడే ఆసక్తికరంగా మారింది.

వేణు స్వామి భేటీ వెనుక పెళ్లి ప్లాన్..?

తాజాగా వేణు స్వామి ఇంటికి దువ్వాడ శ్రీనివాస్, మాధురి కలిసి వెళ్లారు. దీనిపై శ్రీనివాస్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయగా, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. పెళ్లి ముహూర్తం ఖరారు చేసేందుకే వీరు వేణు స్వామిని కలిశారని ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే వేణు స్వామి వారి వివాహం జరిపించబోతున్నారని చర్చ నడుస్తోంది.

ఇక వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది. వేణు స్వామి ఆశీర్వాదంతో త్వరలోనే పెళ్లికి ముహూర్తం ఖరారవుతుందా? లేదా ఈ భేటీ వెనుక మరేదైనా కారణముందా? అన్నది చూడాల్సిన విషయం.

Leave a Reply