AP: ఏపీలో గణేష్ మండపాలకు శుభవార్త.. ఫ్రీగా ఆ సదుపాయం కల్పించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకునే భక్తులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ (Free Electricity) అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల గణేష్ మండపాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి ఉచిత విద్యుత్ అందించాలంటే ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.25 కోట్ల భారం మోసుకోవాల్సి ఉంటుందని అంచనా.

Also Read: కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

అయితే కోట్లాది గణేష్ భక్తుల సౌకర్యం కోసం ఈ ఖర్చును భరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

అంతేకాక, రాబోయే విజయదశమి సందర్భంగా జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల మండపాలకు కూడా ఇదే విధంగా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read : మెగా ఫ్యామిలీకి షాక్.. రామ్ చరణ్ సినిమాకు నో చెప్పిన మలయాళ నటి..!

తెలంగాణలోనూ గణేష్ మండపాలు, దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం ఇప్పటికే తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భక్తుల్లో ఆనందం నింపింది.

Leave a Reply