ఐపీఎల్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానులను అబ్బురపరిచిన బీహార్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. వయసు కేవలం 14 ఏళ్లు అంటూ రికార్డులు సృష్టించిన ఈ యువ ఆటగాడు వయస్సు నిజమేనా అన్న సందేహాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా, తాజ్‌పూర్ అనే గ్రామానికి చెందిన వైభవ్.. గుజరాత్ పై 35 బంతుల్లో సెంచరీ చేసి చరిత్రలోకి ఎక్కాడు. అతడిపై అప్పుడు ప్రశంసల వర్షం కురిసినా.. ఇప్పుడు అతని వయస్సే చర్చనీయాంశంగా మారింది. మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ ఇప్పటికే దీనిపై ప్రశ్నలు లేవనెత్తగా.. తాజాగా ఇద్దరు వ్యక్తుల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో వారు, వైభవ్ వయసు 16 సంవత్సరాలే అని స్పష్టంగా చెబుతున్నారు.
ఒకరు అయితే, “వైభవ్ మా ఊరే.. మేమే నెట్స్‌లో బౌలింగ్ చేసేవాళ్లం. అతని అసలు వయసు 16 ఏళ్లు” అని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు వైరల్ కావడంతో, అతడి వయస్సు పట్ల మరోసారి అనుమానాలు రాజుకుంటున్నాయి. అంతేకాదు, 2023లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సెప్టెంబర్‌లో తాను 14వ ఏట అడుగుపెడతానన్న మాటలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అయితే ఆయన సర్టిఫికెట్‌లో పుట్టిన తేది మాత్రం 2011 మార్చి 27గా ఉంది.
ఇకపై ఈ వివాదం ఎలా మారుతుందో చూడాలి కానీ.. ఇప్పటికే వైభవ్ మంచి పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. గుజరాత్ పై సెంచరీతో సత్తా చాటినా, ముంబై మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. రెండు బంతులే ఆడి, తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
ఇక ఈ వయసు వివాదం క్రికెట్ మైదానంలో కాకుండా బయట మరింత గందరగోళం రేపేలా ఉంది.